మెదక్ మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాట రూ. 70 నుంచి రూ. 80 వరకు పలుకుతోంది. పచ్చి మిర్చి రూ.80, బెండకాయ రూ.50. ఏ కూరగాయలు కొనాలన్న కనీసం 50 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. నెల కిందట టమాట 20 రూపాయలకు కిలో ఉండేది. కానీ నేడు అమాంతం రూ. 80 కు పెరగడం వల్ల అటు వ్యాపారస్తులు ఇటు ప్రజలు లబోదిబోమంటున్నారు.
రూ. 500 పైనే ఖర్చు
ప్రజలు ఏది కొనాలన్న ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఈసారి వర్షాభావ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల కూరగాయల సాగు తగ్గింది. కూరగాయల కొరతతో రేట్లు పెరిగిపోయాయి. గతంలో రూ.100 తీసుకుని మార్కెట్కు వెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి కానీ ఇప్పుడు రూ. 500 తీసుకెళ్లినా నాలుగు రకాల కూరలు వచ్చే పరిస్థితి లేదు.