తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కర్ణాటక పోలీసుల కస్టడీలో వరవరరావు - undefined

విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్గార్​ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావును పుణె కేంద్ర కారాగారం నుంచి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2005 తుమకూరు నక్సల్​ దాడి ఘటనలో వరవరరావుపై కేసు ఉంది.

కర్ణాటక పోలీసుల కస్టడీలో వరవరరావు

By

Published : Jul 4, 2019, 1:55 PM IST

విరసం నేత వరవరరావును కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. 2005 తుమకూరు కర్ణాటక రిజర్వు పోలీసులపై నక్సల్​ దాడి ఘటనలో బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఇప్పటికే వరవరరావు ఎల్గార్‌ పరిషత్‌ కేసులో నిందితుడిగా ఎరవాడ కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండగా కర్ణాటక పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈరోజు వరవరరావును పావగడ పోలీసులు జేఎంఎఫ్​సీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఇదే కేసులో ప్రముఖ గాయకుడు గద్దర్​ని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక బృందాన్ని కూడా నియమించారు.

తమకూరు నక్సల్ దాడి...

2005 ఫిబ్రవరి 6న మావోయిస్టు నాయకుడు సాకేత్‌ రాజన్‌ అలియాస్‌ ప్రేమ్‌ కర్ణాటకలోని చిక్‌మంగళూరు ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. దీనికి ప్రతికారంగా కర్ణాటక పావగడలోని కేఎస్​ఆర్​పీ క్యాంపుపై 2005 ఫిబ్రవరి10న నక్సలైట్లు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు రిజర్వు పోలీసులతో సహా ఓ పౌరుడు మృతి చెందారు. దాడికి సంబంధించిన ఛార్జిషీటులో వరవరరావు, గద్దర్​తో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి:రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన

For All Latest Updates

TAGGED:

varavara rao

ABOUT THE AUTHOR

...view details