టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ నెల 3న తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. రాజీనామా పత్రాన్ని సభాపతికి సోమవారం అందజేయనున్నట్లు సమాచారం. ఉత్తమ్ 2018 డిసెంబర్లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం మేరకు నల్గొండ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. రెండింటిలో గెలిచిన ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు.
ఈనెల 3న ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా!
ఈనెల 3న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. రాజీనామా పత్రాన్ని సోమవారం సభాపతికి అందజేయనున్నట్లు సమాచారం.
ఉత్తమ్ రాజీనామా!
హుజుర్నగర్ శాసనసభ సభ్యత్వానికి ఉత్తమ్ రాజీనామా అనంతరం జరిగే ఉపఎన్నికలో ఆయన సతీమణి పద్మావతి అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఆమె పోటీకి విముఖత చూపుతున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: మద్యం మత్తులో పీక కోసుకున్నాడు...
Last Updated : Jun 1, 2019, 7:29 AM IST