తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఫిరాయింపులపై సభాపతికి టీపీసీసీ అధ్యక్షుడి లేఖ - uttam letter

ప్రతిపక్షాన్ని అధికారపక్షంలో విలీనం చేస్తారన్న ప్రచారాలను ఖండిస్తూ... ఉత్తమ్​కుమార్​రెడ్డి సభాపతికి లేఖ రాశారు. విలీన ప్రక్రియ స్పీకర్​ చేతిలో ఉండదని పేర్కొంటూనే... పార్టీ మారనున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

తక్షణమే అనర్హత వేటు వేయాలి

By

Published : Apr 27, 2019, 10:05 PM IST

తక్షణమే అనర్హత వేటు వేయాలి

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్​రెడ్డి పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్​రెడ్డికి లేఖ రాశారు. సీఎల్పీని తెరాసలో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోందని పేర్కొన్న ఉత్తమ్‌... పార్టీ మారనున్నట్లు ప్రకటించిన శాసనసభ్యులపై చేసిన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెరాసలో చేరనున్న ఎమ్యెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

విలీనం చేసే అధికారం లేదు...

విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదని... రాజ్యాంగంతోపాటు, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్​... ప్రాంతీయ పార్టీలో విలీనం ఎలా అవుతుందని ఉత్తమ్‌ ప్రశ్నించారు. టీపీసీసీ సమావేశం పెట్టకుండా, పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా సీఎల్పీ సమావేశం పెట్టడానికి నిబంధనలు అనుమతించవని స్పష్టం చేశారు. ఫిరాయింపుదారులపై రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విలీన ప్రక్రియను అనుమతించొద్దని సభాపతికి ఉత్తమ్‌కుమార్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: తప్పులు దొర్లిన మాట వాస్తవమే... కానీ...!

For All Latest Updates

TAGGED:

uttam letter

ABOUT THE AUTHOR

...view details