అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తమ పార్టీ నాయకుల జోలికి వస్తే సహించేది లేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, కో- ఆప్షన్ సభ్యులను ఆయన సన్మానించారు. రాష్ట్రంలో తెరాస అభివృద్ధిపై దృష్టి సారించకుండా.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో ఉందని విమర్శించారు. నల్లగొండ పార్లమెంటు సభ్యునిగా ఉన్నా... నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. మూడు నెలల్లో జరగబోయే హుజూర్నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మా కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు: ఉత్తమ్ - హుజూర్నగర్
గెలిచినా.. ఓడినా... కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి