ఉరీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం - ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్లోని పాక్ సరిహద్దు ప్రాంతం ఉరీలో భద్రతా సిబ్బంది ఆదివారం రాత్రి కాల్పులు జరిపారు.
తనిఖీలు చేపడుతున్న బలగాలు
జమ్ముకశ్మీర్లోని పాక్ సరిహద్దు ప్రాంతం ఉరీలో ఆదివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రజర్వాణికి చెందిన సైనిక బృందం తనిఖీలు చేపట్టింది. అనుమానాస్పద కదలికలు గుర్తించిన భద్రతాసిబ్బంది కాల్పులు ప్రారంభించింది. పోలీసులు, భద్రతాదళాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.