కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమితులు ఉన్నా తమ పరిధి మేర 80కి పైగా దేశాలతో టీకాలను పంచుకున్నట్లు ఐక్యరాజ్య సమితికి భారత్ వివరించింది. 150కి పైగా దేశాలకు ఔషధాలు, రక్షణ పరికరాలను సరఫరా చేసినట్లు ఐరాస విభాగం డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్(సీడీసీ)కి తెలిపింది. ఈ మేరకు సీడీసీ సమావేశంలో మాట్లాడిన భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ అమర్నాథ్.. భారత్ తీసుకొచ్చిన వ్యాక్సిన్ మైత్రి ద్వారా పొరుగు దేశాలతో పాటు లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాలకు టీకాలను సరఫరా చేసినట్లు చెప్పారు.
ఇప్పటివరకు 6.6 కోట్లకు పైగా డోసులను ప్రపంచ దేశాలకు అందించినట్లు ఐరాసకు భారత్ తెలిపింది. గత దశాబ్దాల కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద విపత్తు.. కరోనా అని సీడీసీలో భారత్ పేర్కొంది. మరోవైపు, వైరస్‌పై తప్పుడు సమాచారం వ్యాప్తి పెరిగిందన్న భారత్.. నిజమైన సమాచారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు సీడీసీ సెషన్‌లో పేర్కొంది. ఆ దిశగా ఐరాస కృషి చేయాలని సీడీసీకి విన్నవించింది.
సాయం చేస్తున్నాం: ఐరాస