తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు - కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి ధర రోజురోజుకి మండిపోతోంది. దిగుబడి లేకపోవటం... డిమాండ్​ ఎక్కువగా ఉండటం... వల్ల ఉల్లి ధరకు రెక్కలొచ్చాయి.

ఉల్లికి రెక్కలు

By

Published : May 30, 2019, 12:43 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఉల్లి సాగు ఎగుమతి చేసే స్థాయిలో లేకపోవటంతో.... దేవరకద్ర మార్కెట్ వెలవెలబోతోంది. ప్రతీ బుధవారం జోరుగా సాగే మార్కెట్​లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వినియోగదారులే వ్యాపారులతో పోటీపడి మరి కొనుగోలు చేస్తున్నారంటే... ఉల్లికి ఉన్న డిమాండ్​ని అర్థం చేసుకోవచ్చు. ఇదే అవకాశంగా తీసుకున్న వ్యాపారులు 45 కిలోల బస్తా ధర రూ. 650 నుంచి రూ. 750కి పెంచేశారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఉల్లి ధర ఇంకా పెరిగిపోయే అవకాశం ఉందని... అందుకే ఇప్పుడే తీసుకెళ్తున్నామని వినియోగదారులు చెబుతున్నారు.

ఉల్లికి రెక్కలు

ABOUT THE AUTHOR

...view details