తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేడు రాజ్​భవన్​లో తెలుగు సంవత్సరాది వేడుకలు - rajbhawan

ఈ రోజు సాయంత్రం రాజ్​భవన్​లో ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున ఈనెల ఆరో తేదీన రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సరాది వేడుకలు జరగనున్నాయి.

నేడు రాజ్​భవన్​లో ఉగాది వేడుకలు

By

Published : Apr 5, 2019, 6:44 AM IST

వికారి నామ సంవత్సర ఉగాది వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ రోజు సాయంత్రం రాజ్​ భవన్​లో ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ఇక్కడ గవర్నర్​ నరసింహన్​ దంపతులు పాల్గొననున్నారు. పంచాంగ శ్రవణంతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు నూతన సంవత్సర వేడుకలను రేపు ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నారు. ఎన్నికల నియమావళి రీత్యా ప్రగతి భవన్​లో​ నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. రవీంద్రభారతిలో జరిగే వేడుకల్లో సీఎస్​ ఎస్కే జోషి పాల్గొననున్నారు.

నేడు రాజ్​భవన్​లో ఉగాది వేడుకలు

ABOUT THE AUTHOR

...view details