ఉగాది వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం తరఫున రవీంద్ర భారతిలో వికారి నామ సంవత్సర వేడుకలు నిర్వహించనున్నారు. ఎన్నికల నియమావళి రీత్యా ప్రగతి భవన్లో నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. ఈ వేడుకలకు సీఎస్ ఎస్కే జోషి హాజరుకానున్నారు. పంచాంగ శ్రవణంతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గవర్నర్, ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు