సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నాగారం మండలం నర్సింహులగూడెంలో ఓ వివాహ వేడుకకు హాజరవడానికి తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన నర్రసందీప్ (22), జెర్రిపోతుల హరీశ్ (23) ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.
వివాహ వేడుకకు వెళ్తూ... అనంతలోకాలకు... - Accident news in suryapet
వివాహ వేడుకకు వెళ్తున్న ఇద్దరు యువకులను కారు రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఈ విషాదం సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి శివారులో జరిగింది.
వివాహ వేడుకకు వెళ్తూ... అనంతలోకాలకు
ఈ క్రమంలో సూర్యాపేట నుంచి జనగామ వైపు వెళ్తున్న కారు వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నర్ర సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. హరీశ్‌కు తీవ్ర గాయాలు కాగా... పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.