రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్నం వెల్లడించారు. ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు...!
రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ములుగు, వరంగల్- పట్టణ, వరంగల్- గ్రామీణ, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యపేట, నల్గొండ, నగర్ కర్నూల్, వనపర్తి , జనగామ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల ఈరోజు భారీవర్షాలు, రేపు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందన్నారు. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. రాగల 48 గంటల్లో పశ్చిమ వాయువ్యం దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని నాగరత్నం తెలిపారు.