తెలంగాణ

telangana

ETV Bharat / briefs

టిక్​టాక్​ నిషేధానికి తమిళనాడు నిర్ణయం...

వీడియో షేరింగ్​ యాప్​ టిక్​టాక్​ని నిషేధించాలని కేంద్రానికి విన్నవించేందుకు సిద్ధమైంది తమిళనాడు ప్రభుత్వం.

టిక్​టాక్​ నిషేధానికి తమిళనాడు నిర్ణయం...

By

Published : Feb 13, 2019, 1:10 AM IST

Updated : Feb 13, 2019, 9:40 AM IST

ప్రస్తుతం యువత ఎక్కువగా వినియోగిస్తున్న వీడియో షేరింగ్​ యాప్​ టిక్​టాక్​ను నిషేధించాలని కేంద్రానికి వినతి పంపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ వీడియో షేరింగ్ యాప్​ పిల్లలు, యువతపై చెడుప్రభావం చూపిస్తోందని, అందుకే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ప్రకటించింది.
ఎంజేకే పార్టీ శాసనసభ్యుడు తమీమ్ అన్సారీ ఈ విషయాన్ని ముందుగా అసెంబ్లీలో లేవనెత్తారు. ఎమ్మెల్యే ప్రశ్నకు స్పందించిన తమిళనాడు రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి మణికందన్ ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. తమిళ సంస్కృతికి ఈ వీడియో షేరింగ్​ యాప్​​ విరుద్ధంగా ఉందని, యువతపై దుష్ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. బ్లూ వేల్ తరహాలో టిక్ టాక్​ని కూడా నిషేధించేలా కేంద్రం దృష్టికి తీసుకెళతామని మంత్రి వెల్లడించారు.

Last Updated : Feb 13, 2019, 9:40 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details