తెలంగాణ

telangana

ETV Bharat / briefs

టేపులపై సిట్​... రసవత్తరంగా కన్నడ రాజకీయాలు - karnataka

'ఆపరేషన్​ కమల'కు సంబంధించిన ఆడియో టేపులపై ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు

రసవత్తరంగా కన్నడ రాజకీయాలు

By

Published : Feb 11, 2019, 9:23 PM IST

కన్నడనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 'ఆపరేషన్​ కమల'కు సంబంధించిన ఆడియో టేపులపై ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. శాసనసభ స్పీకర్​ రమేశ్​ కుమార్​ సూచన మేరకు ఆడియో టేపుల్లోని నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సిట్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

" స్పీకర్​ సూచన మేరకే సిట్​ ఏర్పాటు చేశాం. ఆయనను కూడా సిట్​ విచారించనుండటం ​నన్ను బాధిస్తోంది."
- హెచ్​డీ కుమారస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి

ఈ ఆరోపణల్లో భాగమైనందున శాసనసభ స్పీకర్ రమేశ్​ను కూడా సిట్​ విచారించాలని భాజపా నేతలు పట్టుబట్టారు. అప్పుడే తమకు నమ్మకం కలుగుతుందని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

స్పీకర్​ తనను విచారించేందుకు స్వయంగా అనుమతించడం వల్ల ఆయనను కూడా ప్రశ్నించేందుకు వీలుగా సిట్​ను ఏర్పాటు చేస్తున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. 15 రోజుల్లోగా నిజానిజాలేంటో నిగ్గుతేల్చాలని అధికారులను ఆదేశించారు.

ఎవరినీ మభ్యపెట్టేందుకు సిట్​ ఏర్పాటు చేయలేదని, నిజాలు బయటికి తెచ్చేందుకేనని స్పష్టం చేశారు స్పీకర్​ రమేశ్​.

అసలేం జరిగింది...

జనతాదళ్​ ఎమ్మెల్యేతో భాజపా రాష్ట్రాధ్యక్షులు యడ్యూరప్ప బేరాలాడారని ఆరోపిస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు 2 గంటల ముందుగా స్వయాన సీఎం కుమారస్వామి ఆడియో టేపును విడుదల చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలులో తమకు అనుకూలంగా వ్యవహరించాలని స్పీకర్​కు భాజపా నాయకులు రూ.50 కోట్లు ఆశ చూపారని కుమారస్వామి ఆరోపించారు.

ముఖ్యమంత్రి తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేఎల్పీ నేత యడ్యూరప్ప ప్రకటించటం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details