ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ తీపికబురు అందించింది. నియామక ఫలితాలు విడుదల చేసింది. 20వేల నియామకాల మైలు రాయిని దాటింది.
టీఎస్‌పీఎస్సీ
By
Published : Feb 12, 2019, 9:17 PM IST
|
Updated : Feb 13, 2019, 9:48 AM IST
టీఎస్‌పీఎస్సీ ఫలితాలు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ నియామక ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 1,856 మంది, టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 653, గురుకులాల్లో టీజీటీ సైన్స్ ఉద్యోగాలకు 52 మందిని ఎంపిక చేసింది. ఒకే రోజు 2,476 నియామక ఫలితాలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ 20 వేల నియామకాల మైలురాయి దాటిందని కార్యదర్శి వాణీప్రసాద్ వెల్లడించారు.