కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష తుది కీ విడుదలైంది. అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఈనెల 6 లోపు తెలపాల్సి ఉంటుంది. గత నెల 28న కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే! శుక్రవారం నుంచి కీ అందుబాటులోకి వచ్చిందని, ఏవైనా అభ్యంతరాలుంటే మండలి వెబ్సైట్ ద్వారా తమకు తెలపాలని పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తప్పని భావించిన ప్రతీ ప్రశ్నను వేర్వేరుగా సమర్పించాలని... ఇందుకోసం వెబ్సైట్లో ప్రత్యేకంగా ఒక ఫార్మాట్ అందుబాటులో ఉంచామని తెలిపారు. అసమగ్రంగా ఉండే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని వెల్లడించారు.
కానిస్టేబుల్ తుది కీ విడుదల చేసిన టీఎస్ఎల్పీఆర్బీ
కానిస్టేబుల్ తుది పరీక్ష కీ పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఈనెల 6 లోపు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
కీ విడుదల చేసిన టీఎస్ఎల్పీఆర్బీ