తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలో రాహుల్​ ప్రచారం - secundrabad

పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్నందు వల్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే  రెండు సార్లు రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఈ నెల 8వ తేదీన మరోసారి ప్రచారానికి రానున్నారు.

ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలో రాహుల్​ ప్రచారం

By

Published : Apr 5, 2019, 6:56 AM IST

ఈ నెల 1వ తేదీన జహీరాబాద్‌, వనపర్తి, హుజూర్‌ నగర్‌లలో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో రాహుల్‌ పాల్గొని హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే... చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలను జనానికి వివరించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు లాంటి అంశాలతో పాటు భాజపా వైఫల్యాలను ఎండగట్టారు. రాహుల్​ పర్యటనతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.

8న రాహుల్​ రాక

రాహుల్‌ ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. మహబూబాబాద్‌, భువనగిరి పార్లమెంటు నియోజక వర్గాల్లో బహిరంగ సభలు, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో రాహుల్‌ పర్యటనపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలో రాహుల్​ ప్రచారం

ఇవీ చూడండి: "కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే 'చౌకీదార్'​ జైలుకే"

ABOUT THE AUTHOR

...view details