పలువురు నాయకులు తమ నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేద్దామని తనను కోరుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. కార్యకర్తల ఆనందం కోసం వారు అడుగుతున్నారని తెలిసినా.. ఆ ర్యాలీలపై చేసే ఖర్చును పసి పిల్లలను కాపాడడానికి వినియోగిస్తే మరింత సంతోషిస్తారని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు సమ్మతమైతే.. ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో ‘అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్‌కి అందించగలరని అర్వింద్ విజ్ఞప్తి చేశారు.
విజయోత్సవాలు వద్దు.. పిల్లలను ఆదుకుందాం - BJP
"కొంతమంది నాయకులు తమ నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేయమని కోరారు. వారి ఆనందం కోసం అడిగారని నాకు తెలుసు. ఆ ర్యాలీలపై చేసే ఖర్చును పసి పిల్లల ప్రాణాలు కాపాడాటానికి వినియోగిస్తే బాగుంటుంది. అది వారికి రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది." -ధర్మపురి అర్వింద్
విజయోత్సవాలు వద్దు