విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి పదో తరగతి ఫలితాల్ని విడుదల చేశారు. 2018-19లో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా జగిత్యాల జిల్లాలో 99.73 శాతం ఉత్తీర్ణతతో ప్రథమస్థానంలో నిలిచింది. పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లిదండ్రుల కృషి వల్లే ఇదంతా సాధ్యమైందంటున్నారు జిల్లా కలెక్టర్ శరత్. వరుసగా మూడో ఏడాది ఉత్తీర్ణతలో రాష్ట్రవ్యాప్తంగా తమ జిల్లా ప్రథమస్థానంలో నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. జూన్ 10 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు.
పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల ఫస్ట్ - పదో తరగతి ఫలితాలు విడుదల
2018-19 పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జగిత్యాల జిల్లా 99.73 శాతం ఉత్తీర్ణతతో ప్రథమస్థానంలో నిలిచింది. ఇందుకు జిల్లా కలెక్టర్ శరత్ సంతోషం వ్యక్తం చేశారు.
పదో తరగతి ఫలితాలు విడుదల