తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెలంగాణ ఎంసెట్​-2019 ఫలితాలు విడుదల - eamcet results

తెలంగాణ ఎంసెట్​ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్​టీయూహెచ్​లో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​ పాపిరెడ్డి, వీసీ వేణుగోపాల్ ​రెడ్డి, ఎంసెట్​ కన్వీనర్​ ఎన్​. యాదయ్య ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్​ బోర్డులో నెలకొన్న గందరగోళం కారణంగా ఎంసెట్ ఫలితాల విడుదల విషయంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు పాపిరెడ్డి.

ఎంసెట్​ ఫలితాలు విడుదల

By

Published : Jun 9, 2019, 12:56 PM IST

Updated : Jun 9, 2019, 3:43 PM IST

ఎంసెట్​ ఫలితాలు విడుదల

ఇంజినీరింగ్​తో పాటు ఫార్మా, అగ్రికల్చరల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్​టీయూహెచ్​లో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​ పాపిరెడ్డి,​ వీసీ వేణుగోపాల్​రెడ్డి, ఎంసెట్​ కన్వీనర్​ ఎన్​. యాదయ్య ఫలితాలను విడుదల చేశారు.

ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చరల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల మూడు నుంచి తొమ్మిది వరకు ఆన్​లైన్​లో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్​కు 1,31,209 మంది... ఫార్మా, అగ్రికల్చరల్ విభాగాల్లో 68,550 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు . తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పరీక్ష రాశారు. ఏపీ నుంచి ఇంజినీరింగ్​కు 19,970 మంది.. ఫార్మా, అగ్రికల్చరల్ విభాగాల కోసం 8,231 మంది విద్యార్థులు తెలంగాణ ఎంసెట్​కు హాజరయ్యారు.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళం తలెత్తినందున ఎంసెట్ ఫలితాల విడుదల విషయంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి. ఇంజినీరింగ్​లో మొదటి ర్యాంకు తాడేపల్లిగూడెంకు చెందిన కె. రవిశ్రీతేజ సాధించారు. రెండు, మూడు ర్యాంకులు డి. చంద్రశేఖర్ ​(హైదరాబాద్​), ఆకాశ్​ రెడ్డిలను వరించాయి. నాలుగో ర్యాంకు హైదరాబాద్​కు చెందిన కార్తీకేయకు వచ్చింది.

అగ్రికల్చర్​, ఫార్మాసీలో మొదటి ర్యాంకు జయశంకర్​ భూపాలపల్లికి చెందిన కుశ్వంత్​కు వచ్చింది. రెండో ర్యాంకు దాసరి కిరణ్ కుమార్​, మూడో ర్యాంకు అరుణ్ ​తేజ సాధించారు. నాలుగో ర్యాంకు సాయిస్వాతిని వరించింది.

ఫలితాలను www.eenaduprathiba.net, www.eenadu.net ద్వారా తెలుసుకోవచ్చు.

Last Updated : Jun 9, 2019, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details