టీఆర్టీ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ప్రగతి భవన మందు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులందరి అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.
'నియామకాలు చేపట్టకుంటే ఆమరణ దీక్ష తప్పదు' - టీఆర్టీ అభ్యర్థులు
టీఆర్టీ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ గోషామహల్ స్టేడియంలో అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రెండు మూడు రోజుల్లో నియామక ప్రక్రియ చేపట్టకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
'నియామకాలు చేపట్టకుంటే ఆమరణ దీక్ష తప్పదు'
ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే అరెస్టులు చేయడం దారుణమని టీఆర్టీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహల్ మైదానంలో అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. టీఆర్టీ నియామకాలు చేపట్టకుండా విద్యావాలంటీర్లను కొనసాస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఆర్థిక, మానసిక క్షోభ అనుభవిస్తున్నామని వాపోయారు. రెండు మూడు రోజుల్లో ఆమరణ దీక్షలు చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్
Last Updated : Jun 13, 2019, 8:47 PM IST