తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జాతీయ పార్టీలకు డిపాజిట్​ గల్లంతు: మంత్రి జగదీశ్​ రెడ్డి - suryapet

సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో తెరాస లోక్​సభ అభ్యర్థి నరసింహారెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్​ రెడ్డి పాల్గొన్నారు.

సూర్యాపేటలో తెరాస ఆత్మీయ సమ్మేళనం

By

Published : Apr 8, 2019, 6:11 AM IST

దేశ ప్రగతి కుంటుపడటానికి ప్రధాన కారణం జాతీయ పార్టీలేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో తెరాస నేతలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాంగ్రెస్​, భాజపాలకు దేశంలోని రెండు వందల నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. పలువురు కార్యకర్తలు ఆయన సమక్షంలో తెరాసలో చేరారు. కార్యక్రమంలో నల్గొండ తెరాస లోక్​సభ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సూర్యాపేటలో తెరాస ఆత్మీయ సమ్మేళనం

ABOUT THE AUTHOR

...view details