తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మంత్రులు, జడ్పీఛైర్మన్లకే ఛాన్స్​ - కేటీఆర్​

ఈ నెల 24 చేపట్టనున్న తెరాస జిల్లా కార్యాలయాల శంకుస్థాపనలపై కేటీఆర్​ సమీక్షించారు. మంత్రులు, జడ్పీ ఛైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు.  మొత్తం 28 జిల్లాల్లో పార్టీ నూతన కార్యాలయాల నిర్మాణం చేపట్టనున్నారు.

శంకుస్థాపనకు మంత్రులు, జడ్పీఛైర్మన్లకే ఛాన్స్​

By

Published : Jun 22, 2019, 5:09 PM IST

Updated : Jun 22, 2019, 7:10 PM IST

మంత్రులు, జడ్పీఛైర్మన్లకే ఛాన్స్​

రాష్ట్రంలో తెరాసను పూర్తి స్థాయిలో పునర్నిర్మించడంపై దృష్టిసారించిన కేసీఆర్​ తొలుత పార్టీ జిల్లా కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించారు. 28 జిల్లాల్లో ఈ నెల 24న ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య భూమి పూజ చేయాలని నేతలకు ఆదేశించారు. సమన్వయ బాధ్యతలను కేటీఆర్​కు అప్పగించారు. ఈ మేరకు మంత్రులు, జడ్పీ ఛైర్మన్లతో సమీక్షించిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. ఎవరెవరు ఏ జిల్లాలో శంకుస్థాపన చేయాలో నిర్దేశించారు. కార్యాలయాల నమూనాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్​ ఖరారు చేస్తారన్నారు.

శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు హాజరవ్వాలని కేటీఆర్​ సూచించారు. నిర్మాణానికి అవసరమైన నిధులు పార్టీ అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్​, వరంగల్​ అర్బన్​ జిల్లాల్లో స్థలాలు ఇంకా ఖరారు కాలేదు. వరంగల్​ రూరల్​లో కార్యాలయానికి ఎంపిక చేసిన స్థలం మార్చాలని స్థానిక నేతలు కోరుతున్నారు. మొత్తం తొమ్మిది జిల్లాల్లో మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. మిగతా జిల్లాలో జడ్పీ ఛైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు.

ఏ జిల్లాలో ఎవరు..

శంకుస్థాపన చేయనున్న మంత్రులు

జిల్లా మంత్రి
1 కరీంనగర్ ఈటల రాజేందర్
2 నిర్మల్ అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి
3 నిజామాబాద్ వేముల ప్రశాంత్ రెడ్డి
4 జగిత్యాల కొప్పుల ఈశ్వర్
5 జనగామ ఎర్రబెల్లి దయాకర్ రావు
6 సూర్యాపేట గుంతకండ్ల జగదీష్ రెడ్డి
7 మేడ్చల్ సి.హెచ్.మల్లారెడ్డి
8 మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్
9 జోగులాంబ గద్వాల సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

శంకుస్థాపన చేయనున్న మంత్రులు

జిల్లా జిల్లా పరిషత్​ ఛైర్మన్​/ ఛైర్​పర్సన్​
1 మంచిర్యాల భాగ్యలక్ష్మి
2 ఆదిలాబాద్ జనార్దన్ రాథోడ్
3 కామారెడ్డి శోభ
4 సిరిసిల్ల అరుణ
5 పెద్దపల్లి పుట్ట మధు
6 జయశంకర్ భూపాలపల్లి శ్రీ హర్షిని
7 మహబూబాబాద్ అంగోత్ బిందు
8 ములుగు కుసుమ జగదీష్
9 భద్రాద్రి కొత్తగూడెం కోరం కనకయ్య
10 నల్గొండ బండా నరేందర్​రెడ్డి
11 యాదాద్రి భువనగిరి సందీప్ రెడ్డి
12 సిద్దిపేట రోజా శర్మ
13 మెదక్ హేమలత
14 సంగారెడ్డి పటోళ్ల మంజుశ్రీ
15 రంగారెడ్డి తీగల అనితా రెడ్డి
16 వికారాబాద్ పట్నం సునీతా రెడ్డి
17 నారాయణపేట వనజమ్మ
18 నాగర్​కర్నూల్​ పద్మావతి
19 ఆసిఫాబాద్ కోవా లక్ష్మి

ఇవీ చూడండి: 1.12 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో సాగే లక్ష్యంగా

Last Updated : Jun 22, 2019, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details