ఖమ్మం లోక్‌సభ ఖిల్లాపై ఎట్టకేలకు గులాబీ జెండా ఎగిరింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ స్థానంలో పాగా వేసేందుకు సర్వశక్తులొడ్డిన తెరాస ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పొగొట్టుకున్న చోటే సాధించాలనుకున్న గులాబీ వ్యూహం ఫలించింది. తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన నామ నాగేశ్వరరావు సరికొత్త చరిత్ర లిఖించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ స్థానం గెలవడం గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాం నింపింది.
అలుపెరుగని పోరు
ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ పార్టీగా అవతరించిన తెరాస... ఖమ్మం జిల్లాలో ఉనికిని చాటుకునేందుకు 2001 నుంచి అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. లోక్‌సభ స్థానంలో కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి నుంచి జెండా ఎగురవేసే స్థాయికి ఎదిగింది. నామ నాగేశ్వరరావు 2009లో తెదేపా తరఫున పోటీ చేసి గెలిచారు. ఎన్నికల ముందు గులాబీ గూటికి చేరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
ఫైర్ బ్రాండ్‌పై విజయం