తెరాస తరఫున పోటీ చేసే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేసింది. అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లాలో పార్టీ సీనియర్ నేత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, నల్గొండ జిల్లాలో పార్టీ సీనియర్ నేత తేరా చిన్నపరెడ్డిని బరిలో నిలుపుతున్నట్లు నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. బరిలో నిలిచిన నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఈ నెల 31 న నిర్వహించనున్న ఈ ఉప ఎన్నికలకు 14 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫారాలు - trs mlc candidates list
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు అధికార పార్టీ తెరాస గెలుపు గుర్రాలను ప్రకటించింది. ఈ నెల 14 న నామినేషన్లు స్వీకరించనున్న దృష్ట్యా... సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. పార్టీ వర్గాల్లో ఇప్పటికే ప్రచారంలో ఉన్న పేర్లనే అధిష్ఠానం ప్రకటించింది.
గెలుపు గుర్రాలు...
TAGGED:
trs mlc candidates list