ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలుకు నేడే చివరి రోజు. తెరాస అభ్యర్థి నవీన్ రావు ఈరోజు అసెంబ్లీ కార్యదర్శికి నామపత్రాలు సమర్పించనున్నారు. కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలిపే ఆలోచనలో లేనందున... నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీకి ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్సీగా రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక జరుగుతోంది.
నేడే తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రావు నామినేషన్ - trs mlc
శాసనమండలి ఎమ్మెల్యే కోటా స్థానానికి నామినేషన్ల దాఖలుకు ఈరోజే చివరి రోజు. తెరాస అభ్యర్థి కె.నవీన్ రావు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కార్యదర్శికి నామపత్రాలు సమర్పించనున్నారు.
హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన నవీన్ రావు... తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన నవీన్ రావును ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి బరిలోకి దించాలని నిర్ణయించినప్పటికీ... కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీకి దిగగా.. చివరి నిమిషంలో వ్యూహం మార్చింది. ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని నవీన్ రావుకు హామీ ఇచ్చి... మల్కాజిగిరి స్థానాన్ని మర్రి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చింది.
ఇదీ చూడండి : తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్‌రావు ఖరారు