ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణలో నలుగురు గాయాలపాలయ్యారు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో తెరాస, సీపీఐ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయాలపాలయ్యారు.
కొదుమూరులో తెరాస, సీపీఐ కొట్లాట - fight at kodumuru
ఖమ్మం జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నాయి. కొదుమూరు గ్రామంలో తెరాస, సీపీఐ వర్గీయుల దాడులకు పాల్పడ్డారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు పరస్పరం రాళ్లు రువ్వుకోవటం వల్ల ఘర్షణ తలెత్తింది.
తెరాస, సీపీఐ కొట్లాట