మరో రెండు మూడు రోజుల్లో ప్రకటన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు తెరాస అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తైంది. రంగారెడ్డి స్థానం నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్ స్థానంలో పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ నుంచి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. కొడంగల్ నుంచి తెరాస ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి, మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వరంగల్‌లో కొండా మురళీధర్‌రావు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయటం వల్ల ఈ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించింది. ఇచ్చిన హామీల మేరకే...
ఈ ఎన్నికలపై ఇప్పటికే తెరాస కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి స్థానం కోసం మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చేవెళ్ల ఎంపీ స్థానానికి పోటీ చేయకుండా ఉన్నారు. వరంగల్ స్థానంలో పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని పోటీకి నిలపాలని అధిష్ఠానం భావిస్తోంది. కేటీఆర్‌కు సన్నిహితుడు కావటం, అన్ని విధాలుగా బలంగా ఉండటం వల్ల ఆయన విజయం ఖాయమనే భావనలో తెరాస ఉంది. నల్గొండ నియోజకవర్గం నుంచి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం దక్కనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకే నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఈ ఉప ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల దాఖలుకై 14 వరకు గడువు ఉంది. ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థులను తెరాస ప్రకటించే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లాల మంత్రులు, నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
ఇవీ చూడండి: మొదటి దశ పరిషత్ పోరులో 76.80% పోలింగ్