అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా 'బద్లా'. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీని తమిళంలో రీమేక్ చేయనున్నారు. ముద్దుగుమ్మ త్రిష హీరోయిన్గా నటించనుందని సమాచారం. ఈ అమ్మడుకు తెలుగులో అభిమానులున్నారు. టాలీవుడ్‌లోనూ ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.
బాలీవుడ్ థ్రిల్లర్ రీమేక్‌లో నటించనున్న త్రిష - అమితాబ్
బాలీవుడ్లో అభిమానులను ఆకట్టుకున్న 'బద్లా' సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు. కథానాయికగా త్రిష నటించనుందని సమాచారం.
![బాలీవుడ్ థ్రిల్లర్ రీమేక్‌లో నటించనున్న త్రిష](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2771784-610-aac7550a-a4ae-48bc-a551-47fe71c93ce0.jpg)
బద్లా సినిమా రీమేక్‌లో నటించనున్న త్రిషా
టాలీవుడ్లో ఆకాశమంత, గగనం చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన రాధామోహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఈ మధ్య త్రిష నటించిన '96' సినిమా తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిస్తున్నారు.
Last Updated : Mar 23, 2019, 10:36 AM IST