సూర్యాపేట జిల్లా కోదాడలోని కూరగాయల మార్కెట్లో ఏపుగంటి సత్తిబాబు(60) అనే వ్యక్తి కిరణా షాప్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దుకాణం నుంచి దుర్వాసన రావడం వల్ల గుమాస్తా షాప్ తెరిచి చూడగా... సత్తిబాబు విగతజీవిగా కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఇది హత్యనా.. లేదా ఆత్మహత్యనా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
షాప్లో ఉరి వేసుకున్న వ్యాపారి - వ్యాపారి ఆత్మహత్య
కోదాడలోని కూరగాయాల మార్కెట్లో విగతజీవిగా ఓ వ్యాపారి కనిపించాడు. అది హత్యనా.. లేదా ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కూరగాయల మార్కెట్లో విగతజీవిగా వ్యాపారి