వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. 2009 మే నెలలో కడప నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో 2010 ఏప్రిల్ 9న ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈక్రమంలో కాంగ్రెస్తో భేదాభిప్రాయాలు రావటం వల్ల 2010 నవంబర్ 29న కాంగ్రెస్‌కు, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
2011లో వైకాపా స్థాపన..
తర్వాత 2011 మార్చి 11న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2011 మార్చి 12న ఇడుపులపాయలో వైకాపా జెండాను ఆవిష్కరించారు. 2011మేలో కడప లోక్‌సభ ఉపఎన్నికల్లో 5.45 లక్షల ఆధిక్యంతో వైకాపా తరఫున ఎన్నికయ్యారు. 2012 జూన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో 15 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానంలో విజయం సాధించారు. 2014లో పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ప్రజాసంకల్ప యాత్రకు ముగింపు పలికారు. గురువారం నాడు 12 గంటల 23 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
కుటుంబ నేపథ్యం...