తరుణ్ భాస్కర్.. తొలి సినిమా ‘పెళ్లి చూపులు’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకొని చిత్రసీమ దృష్టిని ఆకర్షించాడు. ‘ఈ నగరానికి ఏమైంది’తో రెండో అడుగులో తడబడ్డాడు. వెంకీ అట్లూరి.. ‘తొలిప్రేమ’ చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు. కానీ, తర్వాత చేసిన ‘మిస్టర్ మజ్ను’తో నిరాశపరిచింది. ‘ఘాజీ’తో మెరిసిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి.. రెండో ప్రయత్నంలో ‘అంతరిక్షం’తో మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాడు. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి యువ దర్శకుడు ద్వితీయ విఘ్నాన్ని దాటలేక ఇబ్బందులు పడ్డవారే.
టాలీవుడ్ దర్శకులకు రెండో సినిమా సెంటిమెంట్..! - సంకల్ప్ రెడ్డి
మజిలీతో ఆకట్టుకునేందుకు వస్తున్న శివ నిర్వాణ.. రెండో సినిమా సెంటిమెంట్ అధిగమిస్తాడా లేదా కొనసాగిస్తాడా అనేది చూడాలి.
త్వరలో ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శివ నిర్వాణ.. రెండో సినిమా సెంటిమెంట్‌ను ఎదుర్కోబోతున్నాడు. నానితో కలిసి ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు నాగచైతన్యతో రెండో ప్రయత్నంగా ‘మజిలీ’ తెరకెక్కించాడు. వీరిద్దరూ కలిసి ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారేమో చూడాలి.
చైతూ కూడా సరైన విజయం కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తునే ఉన్నాడు. అందులోనూ పెళ్లి తర్వాత తన భార్య సమంతతో కలిసి నటిస్తోన్న తొలి చిత్రం కావడం వల్ల దీనిపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.