ఓ ఇరవై సంవత్సరాల ముందు.. ప్రతిరోజూ సూర్యోదయాన మనం నిద్ర లేచే సమయానికి కిచ కిచమంటూ పిచ్చుకల అరుపులు వినిపించేవి. కానీ ఇప్పటి తరానికి ఆ అనుభూతి దక్కే అవకాశం కనుమరుగైంది. అక్కడక్కడ మాత్రమే అరుదుగా కనిపిస్తున్నాయి. ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా అవి అంతరించి పోతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వాటి మనుగడ కష్టమైపోతోంది.
వెంటనే సెల్‌ఫోన్ వాడటం ఆపండి! - పక్షిరాజు
నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. కనుమరుగవుతున్న వీటిని సంరంక్షించే బాధ్యతను అందరూ భుజానెత్తుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. వాటిని సంరక్షించుకోవాలనే ప్రతిజ్ఞ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. వేసవిలో అవి ఎండ వేడిమికి చనిపోయే ప్రమాదముంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి మేడపైన ఓ పాత్రలో నీరు పోసి పెట్టాలని సూచిస్తున్నారు. అధిక శబ్దాలు చేయడం పిచ్చుకలు అంతరించిపోవడానికి మరో కారణమని చెప్తున్నారు.
ఈ మధ్య వెండితెరపై సందడి చేసిన సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా 'రోబో 2.0'. ఇందులో పక్షిరాజు పాత్ర పక్షులతో పాటపిచ్చుకల్ని సంరక్షించాలనే సందేశాన్ని చెప్పింది. 'వరల్డ్ ఇజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్(భూమిపై జీవించే హక్కు మనుషులకే సొంతం కాదు)' అనే క్యాప్షన్ అందరినీ ఆలోచింపజేసింది.