తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఇవాళ సినీనటి విజయనిర్మల అంత్యక్రియలు

నటి, దర్శకురాలు విజయనిర్మల అంత్యక్రియలు  ఇవాళ  హైదరాబాద్‌లో జరగనున్నాయి. విజయనిర్మల భౌతికకాయానికి చిలుకూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉదయం 11.00 గంటలకు దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.

విజయనిర్మల భౌతిక కాయానికి అంత్యక్రియలు

By

Published : Jun 28, 2019, 6:59 AM IST

Updated : Jun 28, 2019, 1:21 PM IST

అనారోగ్యంతో గురువారం తుదిశ్వాస విడిచిన అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మలకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. నానక్‌రామ్‌గూడలోని నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్​, ఇతర మంత్రులు, చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌, కృష్ణంరాజు, మోహన్‌బాబు తదితరులు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె భర్త కృష్ణ, కుమారుడు నరేశ్​, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

విజయనిర్మల పార్థివదేహానికి నేడు చిలుకూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఫిల్మ్ చాంబర్​కి పార్థివ దేహాన్ని తీసుకెళ్లడం లేదని ఆమె కుమారుడు నరేశ్​ తెలిపారు. ఉదయం 9 గంటలకు నానక్‌రామ్‌గూడ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

సినీనటి విజయనిర్మల అంత్యక్రియలు
Last Updated : Jun 28, 2019, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details