తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అండమాన్​లో దీదీ పార్టీ అభ్యర్థికి కమల్​ మద్దతు - wesst bengal

లోక్​సభ ఎన్నికల్లో తమ పార్టీ తృణమూల్​ కాంగ్రెస్​తో కలిసి పోటీ చేసే అవకాశముందని మక్కల్​ నీది మయ్యం అధ్యక్షుడు కమల్​ హాసన్​ తెలిపారు. మమతా బెనర్జీతో భేటీ అనంతరం అండమాన్​లో తృణమూల్​ అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటించారు.

అండమాన్​లో దీదీ పార్టీ అభ్యర్థికి కమల్​ మద్దతు

By

Published : Mar 26, 2019, 12:08 AM IST

అండమాన్​లో తృణమూల్​, కమల్​ పార్టీ పొత్తు
లోక్​సభఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​, మక్కల్ నీది మయ్యమ్​ పార్టీలు కలిసి పనిచేస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కమల్​ హాసన్​. తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బంగాల్​ సీఎం మమతా బెనర్జీతో కమల్​ సమావేశమయ్యారు. గంట పాటు చర్చలు జరిపారు. అనంతరం అండమాన్​లో పోటీ చేస్తున్న టీఎంసీ ఎంపీ అభ్యర్థికి తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని ప్రకటించారు. ఈ విషయాన్ని మమతా బెనర్జీ ధ్రువీకరించారు.

ABOUT THE AUTHOR

...view details