తల్లిదండ్రుల గొడవ చిన్నారి ప్రాణం తీసింది - parents fight
తల్లిదండ్రుల మధ్య గొడవ చిన్నారి ఆయువు తీసింది. నిద్రపోతున్న చిన్నారికి క్రికెట్ బ్యాట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదం తమ కుమారుడి ప్రాణం తీసింది. స్థానికంగా నివాసముండే వినోద్- గీత దంపతులు శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. ఆ సమయంలో భార్య గీతపై భర్త వినోద్ క్రికెట్ బ్యాట్ విసిరాడు. ఆ బ్యాట్ ఆమెకు తగల్లేదు కదా... అక్కడే పడుకొని ఉన్న కుమారుడు దినేష్(9)కి పడింది. గాఢ నిద్రలో ఉన్న బాలుడు బాధతో విలవిలలాడిపోయి... స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు... బ్యాట్ తగలడంతో... ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టు నిర్థరించారు. కాశీబుగ్గ ఎస్ఐ రమేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.