ముఖ్యమంత్రి కేసీఆర్.. తిరుపతి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్‌కు... వైకాపా నేతలు రెడ్డప్ప, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చింతల, ఆదిమూలం, నవాజ్ బాషా ఘన స్వాగతం పలికారు. కాసేపు.. వారితో ముచ్చటించారు. అనంతరం.. రోడ్డుమార్గాన తిరుమలకు వెళ్లారు. ఈ రాత్రికి తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహంలో సీఎం బస చేయనున్నారు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రత పెంచారు.
తిరుపతికి కేసీఆర్.. వైకాపా నేతల ఘన స్వాగతం - tirupati
తిరమల శ్రీవారి దర్శన నిమిత్తం.. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లారు. రేపు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు.
కేసీఆర్ తిరుపతి పర్యటన