టిక్‌టాక్ దేశవ్యాప్తంగా అతితక్కువ కాలంలో విశేష ఆదరణ పొందింది. చాలా మంది ఆ యాప్‌నకు బానిసలుగా మారారు. కేంద్రం ఇటీవల టిక్‌టాక్‌ను నిషేధించినప్పటికీ.. ఆన్లైన్లో దాని గురించి వెతుకుతూనే ఉన్నారు. అదే ఇప్పడు సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. టిక్‌టాక్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చనే లింకులు పంపుతూ విలువైన సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. టిక్‌టాక్‌ను సరికొత్త ఆయుధంగా వాడుతున్నారు.
చాలా మంది టిక్‌టాక్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు ఆన్లైన్లో టిక్‌టాక్ ఏపీకే ఫైల్‌ను వెతుకుతున్నారు. ఇదే అవకాశాన్ని వినియోగించుకుని నేరగాళ్లు ఫేక్ ఏపీకే ఫైల్‌ను మెయిల్‌కు పంపుతున్నారు. ఆ ఉచ్చులో పడి క్లిక్ చేసి ఎందరో మోసపోతున్నారు.
దీనికి సంబంధించి సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో ఓ సందేశం వైరల్‌గా మారింది. తాము పంపిన లింక్ ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేస్తే.. టిక్‌టాక్‌ను మళ్లీ సాధారణంగా వినియోగించవచ్చని ఆ వార్త చక్కర్లు కొడుతోంది.
అలాంటి లింక్‌లపై ఈటీవీ భారత్ అవగాహన కల్పిస్తోంది. ప్రజలు దానిలోని నిజానిజాలను తెలుసుకోవాలని సూచిస్తోంది. అలాంటి లింక్‌లను ఓపెన్ చేయగానే మన కాంటాక్ట్స్‌లోని ఫోన్ నంబర్లన్నీ సైబర్ నేరస్థులకు చేరిపోతాయి. ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసిన తర్వాత ఎక్కువగా యాడ్స్ వస్తూ విసుగు చెందిస్తాయి. కొందరు డేటా గోప్యతను నిర్లక్ష్యం చేయటం ద్వారా అలాంటి వాటితో మన ఫోన్లోని సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యసనం అనే ఒక ఆయుధంతో నేరస్థులు ఫోన్లలోకి మాల్వేర్ను పంపిస్తున్నారని చెబుతున్నారు.
"అలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు అవగాహన ఒకటే సరైన మార్గం. మన ఫోన్ నంబర్లను తీసుకోవటం ద్వారా ఇతరులకూ నష్టం జరిగే అవకాశం ఉంది. నిషేధించిన యాప్‌లను డౌన్లోడ్ చేసేందుకు ఎలాంటి లింకులపై క్లిక్ చేయొద్దు."
- విశాల్ వర్మ, సైబర్ సెక్యూరిటీ నిపుణులు
సైబర్ నేరగాళ్లకు సరికొత్త ఆయుధంగా టిక్‌టాక్ ఇదీ చూడండి: టిక్‌టాక్ సహా ఆ 59 యాప్‌లకు కేంద్రం 79 ప్రశ్నలు!