తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ప్రపంచకప్​ టికెట్లు సిద్ధం!

మే 30 నుంచి ఇంగ్లండ్​లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్​లకు​ టికెట్లు సిద్ధమయ్యాయి. మార్చి 21 నుంచి సంబంధిత వెబ్​సైట్​లో అందుబాటులో ఉండనున్నాయి. భారత్-పాక్ మ్యాచ్​ టికెట్లు దక్కించుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.

By

Published : Mar 19, 2019, 7:00 PM IST

Updated : Mar 19, 2019, 9:06 PM IST

మార్చి 21 నుంచి అందుబాటులోకి రానున్న ప్రపంచకప్​ టికెట్లు

క్రికెట్ పండుగకు సర్వం సిద్ధమవుతోంది. ప్రపంచకప్-2019కు ​ఇంగ్లండ్, వేల్స్ సంయుక్తంగా అతిథ్యమిస్తున్నాయి. దీనికి సంబంధించిన టికెట్లు మార్చి 21 నుంచి 'సీడబ్యూసీ 19 టికెటింగ్ వెబ్​సైట్'​లో అందుబాటులో ఉండనున్నాయి. 8 లక్షల టికెట్లకు 30 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

జూన్ 16న మాంచెస్టర్​లో జరిగే ఇండో-పాక్ పోరు కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్​ టికెట్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. 25 వేల సిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఈ స్టేడియానికి 4లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

భారత్-పాక్ మ్యాచ్​కు అత్యధిక సంఖ్యలో 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. ఎక్కువ మంది దీన్ని చూసి నిరుత్సాహ పడుతున్నారు. లార్డ్స్​లో జరిగే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్​ కన్నా దీనికే డిమాండ్ ఎక్కువగా ఉంది. ---స్టీవ్ ఎల్లర్టి, ఐసీసీ వరల్డ్ కప్ డైరెక్టర్

నకిలీ వెబ్​సైట్​లో ఈ టోర్నీ టికెట్లను అమ్మేవారి పైనా దృష్టిపెట్టింది ఐసీసీ. ధ్రువీకృత వెబ్​సైట్​లో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని అభిమానులకు సూచించింది. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి టికెట్ల ధరలను పర్యవేక్షిస్తోంది.

మొదటగా వచ్చే వారికే మొదటి టికెట్ అమ్మడం అనే పద్ధతిని అవలంబిస్తోంది ఐసీసీ. ఈ మెగాటోర్నీకి హాజరు కావాలనుకునేవారు ఎంత తొందరగా వెళితే అంత త్వరగా వాటిని దక్కించుకోవచ్చు.

Last Updated : Mar 19, 2019, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details