నెదర్లాండ్స్లో దుండగుడు కలకలం సృష్టించాడు. నిత్యం రద్దీగా ఉండే హేగ్ నగర వీధుల్లో కత్తితో దాడికి తెగబడ్డారు. బ్లాక్ ఫ్రైడే నాడు జనాలతో కిటకిటలాడుతున్న గోటే మార్కెట్స్ర్టాట్లోని షాపింగ్ మాల్ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరు మైనర్లని పోలీసులు తెలిపారు.
ఈ ఆకస్మిక దాడికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఆ ప్రాంతంలోని ప్రజలు. ప్రాణ భయంతో పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
లండన్లో ఇద్దరిని బలిగొన్న ఉగ్ర సంబంధిత దాడి జరిగిన కొద్ది గంటలకే నెదర్లాండ్స్లో ఇలాంటి దారుణం జరిగింది. దాడికి పాల్పడ్డ ఆగంతుకుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.