తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు మరింత సమయం కావాలి"

బ్రెగ్జిట్​ అనంతరం బ్రిటన్​కు చేకూరే ప్రయోజనాలు, రక్షణపై.. సమాఖ్యతో చర్చించేందుకు మరింత సమయం కావాలని ప్రధాని థెరెసా మే ఎంపీలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

"ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు మరింత సమయం కావాలి"

By

Published : Feb 13, 2019, 7:34 AM IST

ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు మరింత సమయం కావాలని బ్రిటన్​ ప్రధాని థెరెసా మే ప్రకటించారు. మార్చి 29న ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్​ వైదొలగనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈయూతో చర్చలు కీలక దశలో ఉన్నాయని, ఓ అర్థవంతమైన ఒప్పందానికి మార్గం సుగమం అయ్యేందుకు బ్రెగ్జిట్​ ఆమోదం పొందాలని అభిప్రాయపడ్డారు.

అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా బ్రెగ్జిట్​ ఒప్పందంలో మార్పులు చేశామని తెలిపారు థెరిసా. తదుపరి ఓటింగ్​లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వివాదాస్పదమైన ఐరిష్​ సరిహద్దు అంశంపైనా దృష్టి సారించినట్లు వెల్లడించారు.

ప్రతిపక్షాల ఆరోపణలు...

ప్రతిపక్షాల ఆరోపణలు, నిర్లక్ష్య పూరిత వైఖరి బ్లాక్​ మెయిల్​ రాజకీయాలకు దారి తీస్తున్నాయని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details