తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వైద్యుడి ఇంట్లో భారీ చోరి - karnataka

కర్ణాటక మైసూర్​లోని ఓ వైద్యుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.2కోట్ల విలువైన బంగారాన్ని అపహరించారు దుండగులు. బంగారంతో పాటు రూ.11లక్షల నగదునూ దోచుకెళ్లారు.

బద్దలైన బీరువా

By

Published : Apr 13, 2019, 11:24 PM IST

కర్ణాటకలోని మైసూర్​లో ఓ వైద్యుడి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. రూ.2కోట్ల విలువైన 5కిలోల బంగారం, రూ.11లక్షల నగదును అపహరించారు దుండగులు. వీటితో పాటు 10 కిలోల వెండి, 20 విలువైన గడియారాలు ఎత్తుకెళ్లారు.

మైసూర్​లోని విజయనగరలో వైద్యుడు రాజీవ్​ కుటుంబం నివాసముంటోంది. విదేశాల నుంచి వస్తోన్న తల్లిదండ్రులను ఇంటికి తీసుకొచ్చేందుకు బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లారు రాజీవ్. ఇదే సమయంలో ఇంటి గ్రిల్​ కట్​చేసి లోపలికి ప్రవేశించి దోపిడీ చేశారు దొంగలు.

ఇదీ చూడండి: కార్ల వర్క్​షాప్​లో అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details