తెలంగాణ

telangana

ETV Bharat / briefs

చెంబులో తల ఇరుక్కుపోయి... తల్లడిల్లిన పిల్లి - The cat's head is stuck in the Beaker

మహబూబాబాద్​లో ఓ పిల్లికి విచిత్ర ఘటన ఎదురైంది. పాలకోసం పోయి చెంబులో తలపెట్టింది. అదికాస్త ఇరుక్కుపోయింది. ఇదే సమయంలో ఓ శునకం దానిపై దాడికి దిగింది. ఓ వైపు తల ఇరుక్కుపోయి... ఇటు కుక్క నుంచి తప్పించుకోలేక నానా అవస్థలు పడింది.

చెంబులో తల ఇరుక్కుపోయి... తల్లడిల్లిన పిల్లి

By

Published : Apr 7, 2019, 1:50 PM IST

మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఓ పిల్లి గ్రామ సర్పంచ్​ ఇంట్లో పాలచెంబులో తలపెట్టింది. అంతే...ఎరక్కపోయి ఇరుక్కుపోయామన్నంటూ... అయింది దాని పరిస్థితి. చెంబులో పిల్లి తల ఇరుక్కుపోయింది.

చెంబులో తల ఇరుక్కుపోయి... తల్లడిల్లిన పిల్లి

అప్పటినుంచి దాని గోస వర్ణనాతీతంగా మారింది. తలబయటకు తీయడానికి సర్వశక్తులా ప్రయత్నించింది. సుమారు అరగంట పాటు పిల్ల్లి తల్లిడిల్లిపోయింది.

కష్టానికి మరో కష్టం తోడైనట్లు... ఇదే సమయంలో ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క చూసింది. పిల్లిపై దాడి చేసింది. గమనించిన ఇంట్లోవారు పిల్లిని కాపాడేందుకు కుక్కను గొలుసుతో కట్టేశారు. అనంతరం పిల్లిని పట్టుకుని చెంబు తొలగించారు. అంతే బతుకుదేవుడా అంటూ పిల్లి పరుగులు పెట్టింది.

ఇదీ చూడండి:మలక్​పేటలో రూ.34 లక్షలు పట్టివేత

For All Latest Updates

TAGGED:

CAT

ABOUT THE AUTHOR

...view details