తండ్రి మరణం.. గ్రామీణ నేపథ్యం.. వరుస వైఫల్యాలు ఇవేవీ ఆ యువకుని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. పట్టు వదలకుండా ప్రయత్నించి తన ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో 695వ ర్యాంకు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన శశికాంత్. దేశానికి తన వంతు సేవ చేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెబుతున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందంటున్న శశికాంత్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి....
సివిల్స్‌లో 695వ ర్యాంకు సాధించిన శశికాంత్ - సివిల్స్ ఫలితాలు
వరుసగా ఐదు సార్లు వైఫల్యం చెందినా ఆ యువకుడు వెనక్కి తగ్గలేదు. పక్కా ప్రణాళికతో చదివి దేశ అత్యున్నత పరీక్ష సివిల్స్‌లో 695వ ర్యాంకు సాధించాడు. ఎప్పటికప్పుడు తప్పులను సవరించుకుంటూ విజయం సాధించానని చెబుతున్నాడు షాద్ నగర్‌కు చెందిన శశికాంత్.
సివిల్స్ ర్యాంకర్