తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆదిలాబాద్‌ రిమ్స్‌కు ఎంసీఐ గుర్తింపు పునరుద్ధరణ - rims-mci-green-signal

ఆదిలాబాద్​ రిమ్స్​కు ఎట్టకేలకు మెడికల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా గుర్తింపు పునరుద్ధరించినట్లు రిమ్స్​ డైరెక్టర్​ డా.కరుణాకర్​ వెల్లడించారు. పీజీ కోర్సు మొదలైతే జిల్లావాసులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

రిమ్స్​కు ఎంసీఐ గ్రీన్​ సిగ్నల్​

By

Published : May 8, 2019, 5:59 PM IST

ఏడాది కాలంగా నెలకొన్న అయెమయానికి తెరపడింది. ఆదిలాబాద్​ రిమ్స్​కు మెడికల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా(ఎంసీఐ) గుర్తింపును పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రిమ్స్​ డైరెక్టర్​ డా.కరుణాకర్​ వెల్లడించారు. 2018 జూన్​లో ఎంసీఐ బృందం తనిఖీ చేస్తూ పలు లొసుగులు చూపుతూ కళాశాల గుర్తింపును నిరాకరించింది. 2019 ఫిబ్రవరిలో రెండోమారు తనిఖీలు చేపట్టిన బృందం... తాజాగా కళాశాలకు అనుమతిని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా పీజీ కోర్సుల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తరగతులు ప్రారంభించేందుకు ఎంసీఐకి లేఖ రాయనున్నట్లు కరుణాకర్​ పేర్కొన్నారు.

రిమ్స్​కు ఎంసీఐ గ్రీన్​ సిగ్నల్​

ABOUT THE AUTHOR

...view details