అంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పీ.ఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతని అంత్యక్రియల్లో 51 మంది పాల్గొన్నారు. మృతుని కుమార్తెకు పాజిటివ్ వచ్చింది.
కరోనాతో వ్యక్తి మృతి.. అంత్యక్రియల్లో 51 మంది... - Carona cases updates
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పీ.ఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతని అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి 51 మందికి పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగెటివ్ వచ్చినప్పటికీ 15రోజులు క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు.
అంత్యక్రియల్లో పాల్గొన్నారు... క్వారంటైన్ కు వెళ్లారు
వైద్యులు మొదట గ్రామంలో 9 మంది నుంచి నమూనాలు సేకరించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్న వారి నమూనాలూ సేకరించి పరీక్షించగా నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ వీరందరినీ15 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి: చింతమనేని ప్రభాకర్‌కు 14 రోజుల రిమాండ్