తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎండ తాపానికి జనాల పరేషాన్​! - temperature increase in summer

భానుడి భగభగలకి జనం విలవిల్లాడుతున్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో తీవ్రమైన ఎండలతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.

రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత

By

Published : May 26, 2019, 3:47 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల పగటిపూట జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడంలేదు. ఫలితంగా రహదారులన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో తీవ్రమైన ఎండలతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎండ తీవ్రత తట్టుకోలేక పోతున్నామని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత

ABOUT THE AUTHOR

...view details