తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఇకపై 2 రోజుల్లోనే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ పూర్తి!

ఫోన్​ నంబర్​ను ఒక నెట్​వర్క్​ నుంచి మరో నెట్​వర్క్​కు మార్చుకునేందుకు కొత్త నియమాలొస్తున్నాయి. మొబైల్ నంబర్ పోర్టబులిటీ కొత్త నిబంధనలు ఈ నెల 11 నుంచి అమల్లోకి రానున్నట్లు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్​) స్పష్టం చేసింది. అప్పటి వరకు వేరే నెట్​వర్క్​కు మారేందుకు అవకాశం ఉండదని తెలిపింది.

By

Published : Nov 4, 2019, 5:15 PM IST

Updated : Nov 4, 2019, 8:13 PM IST

నవంబర్​ 11 నుంచి అందుబాటులో పోర్టబిలిటీ కొత్త నియమాలు

టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) మొబైల్​ నంబర్​ పోర్టబిలిటీ (ఎంఎన్​పీ) కొత్త నిబంధనలు నవంబర్ 11 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే అప్పటి వరకు మొబైల్​ నంబర్​ను వేరే నెట్​వర్క్​కు మార్చుకునే వీలుండదని స్పష్టం చేసింది ట్రాయ్​.

సులభంగా మారేందుకు..

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ)కి సంబంధించిన నిబంధనల గురించి చాలాకాలంగా చర్చ నడుస్తోంది. టెలికాం పరిశ్రమలో వినియోగదారులు ఎక్కువగా డిమాండ్ చేసే సేవల్లో పోర్టబిలిటీ ఒకటి.

ప్రస్తుత ఎంఎన్​పీ ప్రక్రియ కనెక్టివిటీకి ఆటంకం కలిగిస్తుంది. ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్​కు పోర్ట్​(మారడానికి) చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్న కొత్త నిబంధనలతో ఇది సులభమవుతుంది.

సమయాన్ని తగ్గించడానికే..

మొబైల్ నంబర్ పోర్టబిలిటీని మరింత సులభతరం చేస్తూ ట్రాయ్​ 2018 డిసెంబర్​లో నూతన నిబంధనలు రూపొందించింది. ఇప్పుడు మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడం సహా ఇది పూర్తి కావడానికి ఉన్న గడువును 7 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిస్తూ నిబంధనలు మార్చింది.

  • కొత్త ట్రాయ్ కొత్త ఎంఎన్​పీ నిబంధనలు సిమ్‌ను ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు పోర్ట్ చేయడానికి ఆపరేటర్లు తీసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
  • అంతరాయం లేకుండా వేగంగా మారడానికి ఈ నియమాలు దోహదపడతాయి.

అన్నీ తర్వాతే..

ఎంఎన్‌పీపై కొత్త నిబంధనలు ఈ రంగంలో సానుకూల మార్పును తీసుకురానున్నాయి. అయితే వీటి అమలు జరిగే వరకు అంటే.. నవంబర్ 10 వరకు ఎటువంటి పోర్టింగ్​ సేవలు అందుబాటులో ఉండవు. వినియోగదారులు ఎటువంటి పోర్టింగ్ కోడ్‌ను పొందలేరు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి.. నవంబర్​ 10 అర్ధరాత్రి వరకు పోర్టింగ్​ సేవలు నిలిచిపోనున్నాయి.

ఇదీ చూడండి:8 రోజుల్లో 5 కీలక తీర్పులు ఇవ్వనున్న జస్టిస్​ గొగొయి!

Last Updated : Nov 4, 2019, 8:13 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details