రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ విడివిడిగా చేపట్టడం సాధ్యం కాదని ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. గ్రామ పంచాయతీల విలీనంతో పాటు.. కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం వల్ల వార్డుల విభజన, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలంటే ఐదు నెలల సమయం పడుతుందని తెలిపింది.
హైకోర్టులో ఎస్ఈసీ పిటిషన్
మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు జులై 2తో ముగియనున్నందున ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం, బీసీ సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలు సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైనా.. వాటి పాలకతేదీలు ముగిసిన తర్వాతే విలీనం పూర్తవుతుంది.