తెలంగాణ

telangana

By

Published : Jun 13, 2019, 6:14 PM IST

ETV Bharat / briefs

పటేకర్​కు క్లీన్​చిట్​ ఎలా ఇస్తారు?: తనుశ్రీ

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్​కు క్లీన్​చిట్​ ఇవ్వడాన్ని తప్పుబట్టారు నటి తనుశ్రీ దత్తా. అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

'అవినీతి పోలీసులు పటేకర్​కు క్లీన్​చిట్ ఇచ్చారు'

బాలీవుడ్​ నటుడు నానా పటేకర్​పై తాను దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు తనుశ్రీ దత్తా. పటేకర్​ వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని బీ సమ్మరీ నివేదికలో పోలీసులు పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

గతంలోనూ పలువురు సినీ పరిశ్రమకు చెందిన మహిళలపై నానా పటేకర్​ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు తనుశ్రీ.

ఇదీ చూడండి: తనుశ్రీ లైంగిక వేధింపుల కేసులో నివేదిక దాఖలు

ABOUT THE AUTHOR

...view details